గుమ్మడికాయతో ఫ్రై..ఇలా చేస్తే మళ్లీ మళ్లీ తింటారు..!

-

 ఫ్రై అంటే. బెండకాయ, బంగాళదుంప ఇలాంటివే గుర్తుకువస్తాయి. కానీ మీరు ఎప్పుడైనా గుమ్మడికాయతో ఫ్రై చేశారా..? అసలు గుమ్మడికాయను అందరి ఇళ్లల్లో పెద్దగా వండరు.. ఎవరికి అంత ఇష్టం ఉండదు. కానీ ప్రకృతి మనకు అందించే ప్రతి కూరగాయ తనదైన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడతుంది. కాబట్టి అన్నీ ఆస్వాదించాలి. గుమ్మడికాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే బీటాకెరోటిన్ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. టేస్టీగా వండుకుంటే ఏదైనా హాయిగా తినేయొచ్చు. ఈరోజు మనం గుమ్మడికాయతో టేస్టీ ఫ్రై విత్ఔట్ ఆయిల్ చూద్దాం.

తీపి గుమ్మడికాయ ఫ్రై చేయడానికి కావాల్సిన పదార్థాలు

ఎర్రగా ఉన్న తీపి గుమ్మడికాయ ముక్కలు ఒక కప్పు
ఉల్లిపాయ ముక్కలు అరకప్పు
వెల్లుల్లి ముక్కలు ఒక టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి ముక్కలు ఒక టేబుల్ స్పూన్
గసగసాలు ఒక టేబుల్ స్పూన్
నల్ల జీలకర్ర  ఒక టేబుల్ స్పూన్
లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్
ఎండుమిరపకాయలు రెండు
మీగడ ఒక టేబుల్ స్పూన్
కొత్తిమీర కొద్దిగా
డ్రై రోజ్ మేరి ఒక టేబుల్ స్పూన్

తయారు చేసే విధానం..

నాన్ స్టిక్ పాత్ర పొయ్యిమీద పెట్టి అందులో ఎండుమిరపకాయ వేసి, డ్రై రోజ్ మెరీ, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, గసగసాలు, పచ్చిమిర్చి ముక్కలు, మీగడ వేసి వేగనివ్వండి. తాలింపు వేగిన తర్వాత నల్లజీలకర్ర వేయండి. ఇది మంచి వాసన ఇస్తుంది. రెండు నిమిషాల తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేయండి. నిమ్మరసం వేయండి. అరకప్పు నీళ్లు వేసి మూతపెట్టండి. నీటి ఆవిరికి గుమ్మడికాయ ముక్కలు మగ్గిపోతాయి. కాసేపటికి నీళ్లు ఆవిరైపోతాయి. మసాల అంతా గుమ్మడికాయ ముక్కలకు పట్టేస్తాయి. కొత్తిమీర వేసి తిప్పేసి దించేయడమే.. టేస్టీగా ఉండే.. గుమ్మడికాయ ఫ్రై రెడీ.. ఇలా వండుకుంటే.. వారానికి ఒకసారి అయినా గుమ్మడికాయను వాడుకోవచ్చు. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈరోజుల్లో రోగనిరోధక శక్తి ఎంత అవసరమే మనందరికి తెలుసు. కాబట్టి.. చీప్ అండ్ బెస్ట్ లో వచ్చే గుమ్మడికాయ ద్వారా ఇలా పొందవచ్చు.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news