పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్..!

-

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల కోసం ఇస్తున్న సేవలని ఎక్స్టెండ్ చేసింది. అలానే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్‌ నగదును విత్ డ్రా చెయ్యడానికి… నామినీ తదితర వివరాలను అప్డేట్ చేయడం ఇలాంటివి అన్నీ కూడా ఆన్ లైన్ చేసేయండి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో డబ్బులని సులభంగా పాక్షికంగా లేదా పూర్తిగా విత్‌డ్రా చెయ్యచ్చు.

ఈ డబ్బులని చందాదారుడు ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయినా డ్రా చెయ్యచ్చు. లేదా వరుసగా రెండు నెలలకు పైగా నిరుద్యోగిగా ఉన్నా సరే డబ్బులని విత్‌డ్రా చేసుకోవచ్చు. వివాహం, మెడికల్ ఎమర్జెన్సీ, హోమ్ లోన్ వంటి వాటికి తీసుకొవచ్చు. అయితే మీరు కనుక ఈ డబ్బులని డ్రా చెయ్యాలని చూస్తుంటే కొన్ని పత్రాలు అప్డేట్ చేయడం అవసరం.

వీటి హెల్ప్ తో మీరు డబ్బులని తీసుకోవచ్చు. అయితే కొన్ని అవసరం అవుతాయి. ఇక వాటి వివరాలను చూస్తే.. రెండు రెవెన్యూ స్టాంపులు కావాలి. అలానే కంపోసిట్‌ క్లయిమ్‌ ఫామ్‌, బ్యాంక్ ఖాతా వివరాలు ఉండాలి. గుర్తింపు కార్డు, చిరునామా వివరాలు, బ్యాంకు IFSC కోడ్ ఉండాలి. వ్యక్తిగత వివరాలు కూడా ఇవ్వాల్సి వుంది. ఉద్యోగం చేసే సమయంలో లేదా విరమణకు 5 సంవత్సరాల ముందు పీఎఫ్ విత్‌డ్రా డీటెయిల్స్ ని కూడా ఇవ్వాల్సి వుంది. PF ఖాతాలో జమ చేసిన మొత్తానికి ఉన్న వివరాలు, ఫారమ్ 2, 3 కావాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version