బ్యూటీ స్పీక్స్ : అలియా మ‌రియు మ‌రో క‌థ

-

చీక‌టి క‌న్నా ఇష్టంగా మ‌రో వెలుగు ఉండాలి
చీక‌టి క‌న్నా ఇష్టంగా మ‌రో చీక‌టి కూడా ఉంటుంది
చీక‌టి అంటే రాజ్యంలో చీలిక అని అర్థం
వెలుగు అంటే రాజ్యంలో ఓ గొప్ప క‌ల‌యిక అని అర్థం
సినిమా రాజ్యంలో చీక‌టి అవ‌కాశాలు రాక
వెలుగు అంటే అవ‌కాశాలు స‌ద్వినియోగం చేసుకోలేక
ఈ రెండూ కూడా అంద‌రి జీవితాన ఉంటాయి
ఆమెకు వెలుగు ఉంది కావాల్సినంత
కానీ చీక‌టి కూడా ఉంది.. ఈ రెండూ స‌మ‌న్వ‌యంతో
ఉన్నాయి.. ప‌ర‌స్ప‌ర అంగీకారంతో కూడా ఉన్నాయి
క‌నుక‌నే ఆమె జీవితం ఇవాళ తెలుగు వారికి చేరువ
భార‌తీయ సినిమాకు చేరువ
ఆమె పేరు అలియా..భ‌ట్

రాజ‌మౌళి క‌న్నా తెలివయిన అమ్మాయి. బ‌న్సాలీ క‌న్నా చురుకుద‌నం ఉన్న అమ్మ‌డు. ఆమె పేరు అలియా భ‌ట్. నాన్న‌పేరు మ‌హేశ్ భ‌ట్. ద‌ర్శ‌క నిర్మాత అయిన ఆయ‌న‌కు ఇప్పుడు కూతురి విజ‌యాలంటే ఇష్టం. ఆ మాట‌కు వ‌స్తే బాలీవుడ్ లో చాలా మంది గంగూభాయ్ అంటేనే ఎక్కువ ఇష్టం. అలియా సీత పాత్ర‌లో మెరిసింది. ఆ మాట‌కు వ‌స్తే ఆ సినిమా చేసింది చాలా త‌క్కువ.
ఆ సినిమా పేరు ట్రిపుల్ ఆర్. వాస్త‌వానికి త‌న‌కు ఈ సినిమా ఓ డ్రీమ్. ఇంత‌కుమించిన డ్రీమ్ గంగూబాయి   కాఠియావాడీ. రెండు క‌ల‌ల మ‌ధ్య ప్ర‌యాణం ఆమె జీవితం.

ఎయిర్ పోర్టులో క‌లిశాడు రాజ‌మౌళి. నేరుగా పోయి మీ సినిమాలో  ఓ అవ‌కాశం ఇవ్వండి ప్లీజ్ అని అన్నారామె. అంత‌కుముందు బ‌న్సాలీ కూడా ఇలాంటి మాటే ఒకటి చెప్పారు.ఆమె కోసమే అన్న‌విధంగా ఒక క‌థ సిద్ధం చేశారు. క‌థ విన్నాక వేశ్యా జీవితాల్లో ఉండే చీక‌టి వెలుగు అన్నింటినీ అర్థం చేసుకోవ‌డం అలియా వంతు అయింది. పాత్ర కోసం బ‌రువు కూడా పెరిగారు. ముంబ‌యి వీధుల్లో ఆమె. త‌రువాత హైద్రాబాద్ దారుల్లో ఆమె. సీత పాత్ర కోసం ఆమెకు ఒక్క భాష అవ‌రోధం అయింది. కానీ జీవితాన ఎన్నో అవ‌రోధాలు తార‌సిల్లాయి. వాటిని దాటి ఇంత‌టి స్థాయికి చేరుకున్నారు ఆమె.

 
– బ్యూటీ స్పీక్స్  – మ‌న లోకం ప్ర‌త్యేకం 

Read more RELATED
Recommended to you

Exit mobile version