వెల్లుల్లితో కొలెస్ట్రాల్ మొదలు ఈ సమస్యలు అన్నీ దూరం..!

-

ఆరోగ్యానికి వెల్లుల్లి చాలా మేలు చేస్తుంది. చాలా మంది వెల్లుల్లి ని వంటల్లో వాడుతూ ఉంటారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తొలగించడం మొదలు వివిధ రకాలుగా వెల్లుల్లి మనకి ఉపయోగపడుతుంది. చాలా రకాల సమస్యలను మనం దూరం చేసుకోవచ్చు కూడా చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే బ్లడ్ సర్కిలేషన్ కి అంతరాయం కలుగుతుంది. ఎల్డీఎల్ వలన గుండె పోటు హైపర్ టెన్షన్ స్ట్రోక్ వంటి సమస్యలు కూడా కలిగే ప్రమాదం ఉంది.

వెల్లుల్లిపాయల వలన కలిగే లాభాలు:

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

వెల్లుల్లి తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కనుక ఇమ్యూనిటీ ని పెంచుకోవాలంటే వెల్లుల్లిని తీసుకుంటూ వుండండి.

కొలెస్ట్రాల్ కరుగుతుంది:

వెల్లుల్లి తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ కరుగుతుంది.

క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది:

వెల్లుల్లిని తీసుకుంటే క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది.

బరువు తగ్గచ్చు:

వెల్లుల్లి తీసుకుంటే బరువు తగ్గేందుకు కూడా అవుతుంది. కనుక అధిక బరువు సమస్య తో బాధ పడేవాళ్ళు వెల్లుల్లి ని తీసుకుంటూ వుండండి.

ఆల్జీమస్ డిమాండ్షియా సమస్యలు ఉండవు:

వెల్లుల్లిని తీసుకోవడం వలన అల్జీమర్స్, డిమెన్షియా ఇబ్బందులు కూడా ఉండవు డయాబెటిస్ కూడా కంట్రోల్ లో ఉంటుంది.

వెల్లుల్లి కొలెస్ట్రాల్ ని ఎలా కరిగిస్తుంది..?

వెల్లుల్లి ని డైట్ లో తరచూ తీసుకుంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం వెల్లుల్లి తీసుకోవడం వలన దాదాపు ఏడు శాతం కొలెస్ట్రాల్ ని తగ్గించవచ్చు. వెల్లుల్లి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది అలానే ఇది బ్లడ్ థిన్నర్ గా కూడా ఇది పనిచేస్తుంది చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. డాక్టర్ చెప్పిన దాని ప్రకారం రోజుకి 400 మిల్లిగ్రాముల వెల్లుల్లి తీసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news