తెలుగు చిత్ర సీమలో నవ్వులకు కేరాఫ్..డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ అని చెప్పొచ్చు. కామెడీ సినిమాలు తీయడంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్న ఈవీవీ..తన తనయులను హీరోలుగా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు. అలా అల్లరి నరేశ్ , రాజేశ్ లు చిత్రసీమలోకి వచ్చారు. కాగా, హీరో నరేశ్ ను ఓ బాలీవుడ్ స్టార్ హీరో సూచన మేరకే హీరో చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా అల్లరి నరేశ్ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.
అల్లరి నరేశ్ చిన్న నాటి నుంచి తండ్రిని చూస్తూ సినిమాలు చూస్తూనే పెరిగాడు. ఈ క్రమంలోనే టెక్నికల్ థింగ్స్ తెలుసుకుంటూ ముందుకు సాగాడు. తనకు హీరో కావాలని అనిపించినప్పటికీ చెప్పే ధైర్యం లేక అలానే ఉండిపోయాడు. అటువంటి సమయంలో ఓ ఫంక్షన్ కు అతిథిగా వచ్చిన బాలీవుడ్ బిగ్ బీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్..అల్లరి నరేశ్ ను చూసి అభిషేక్ బచ్చన్ లాగానే ఉన్నాడని చెప్తూ మంచి హీరో అవుతాడని ఈవీవీకి చెప్పాడు.
దాంతో అల్లరి నరేశ్ తండ్రి ఈవీవీని రిక్వెస్ట్ చేసి యాక్టింగ్ స్కూల్ కు వెళ్లి యాక్టింగ్ నేర్చుకున్నాడు. అలా ఆ తర్వాత కాలంలో తండ్రి దర్శకత్వంలో నే సక్సెస్ ఫుల్ సినిమాలు చేసి టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరో అయ్యాడు.
‘బెండు అప్పారావు ఆర్ఎంపీ’ సినిమాకు లాస్ట్ పార్ట్ ను నాలుగు రోజుల పాటు డైరెక్షన్ చేసిన సంగతి నరేశ్ ఇంటర్వ్యూలో చెప్పాడు. నరేశ్ ఇటీవల కాలంలో తన పంథా మార్చుకున్నాడు. సీరియస్ రోల్స్ ప్లే చేసి ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాడు. మహేశ్ బాబు ‘మహర్షి’ సినిమాలో చక్కటి పాత్ర పోషించిన నరేశ్..‘నాంది’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ‘సభకు నమస్కారం’, ‘ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం’ చిత్రాలు చేస్తున్నాడు.