” మేజర్” సినిమాపై అల్లు అర్జున్ ప్రశంసలు

-

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంపై తెరకెక్కిన “మేజర్” సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాగా.. సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అడవి శేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని సినీ ప్రియులు అంటున్నారు. అన్ని వైపుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో మూవీ మేకర్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. శనివారం భారీ సక్సెస్ మీట్ ను కూడా నిర్వహించారు. ఈ మూవీపై సినీ ప్రముఖులు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

 

తాజాగా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మేజర్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. “డైరెక్టర్ శశికిరణ్ తిక్క పనితనం చాలా బాగుంది. సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రొడ్యూసర్ మహేష్ బాబుకు బిగ్ కంగ్రాచులేషన్స్. ప్రేక్షకుల హృదయాలను తాకే ఇలాంటి సినిమా నిర్మించినందుకు మహేష్ బాబు గారిని గౌరవిస్తున్నా. మేజర్ ప్రతి భారతీయుడి గుండెను తాకే కథ.” అని ట్వీట్ చేశారు బన్నీ.

Read more RELATED
Recommended to you

Latest news