పోలీసు అధికారిపై రేణుకాచౌదరి ఆగ్రహం..భుజాలమీద స్టార్లు పెట్టుకోవడం కాదు అంటూ..

-

హైదరాబాదులో మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై విపక్షాలు ఉద్యమాన్ని తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇటు బీజేపీతో పాటు అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ని కలిసేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి యత్నించారు. అయితే ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా ఓ పోలీసు ఉన్నతాధికారి పై ఆగ్రహం వ్యక్తం చేసిన రేణుకాచౌదరి.. పోలీసుల తీరుపై నిప్పులు చెరుగుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భుజం మీద స్టార్లు పెట్టుకోవడం కాదు బుర్రలోకి దిగాలవి.. అంటూ ఆమె పోలీసు అధికారి పై విరుచుకుపడ్డారు. అసలు ఏమనుకుంటున్నావ్ అంటూ కూడా ఆమె పోలీసు అధికారిని నిలదీశారు. పోలీస్ అధికారి పై ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన రేణుకా చౌదరి కి చెందిన వీడియోను టిపిసిసినే ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news