జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ ద్వంద వైఖరిని కాపులు అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ముద్రగడ ఉద్యమాన్ని చంద్రబాబు అనిచివేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ దాక్కున్నారు? అని ప్రశ్నించారు. ముద్రగడను చంద్రబాబు ప్రభుత్వం వేధించినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు.
హరి రామ జోగయ్య దీక్ష చేస్తేనే పవన్ కళ్యాణ్ స్పందించారని.. టిడిపి ప్రభుత్వంలో మాట్లాడని పవన్ కళ్యాణ్, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. పవన్ ఇప్పుడే మాట్లాడడం వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ద్వంద వైఖరిని కాపు సోదరులు అర్థం చేసుకోవాలని కోరారు మంత్రి అంబటి రాంబాబు.