ఆషికా రంగనాథ్.. తాజాగా కళ్యాణ్ రామ్ నటిస్తున్న అమిగోస్ చిత్రం ద్వారా ఈ కన్నడ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. కన్నడ భాషా చిత్రాలలో ఎక్కువగా నటించిన ఈమె 2016లో కన్నడ చిత్రం క్రేజీ బాయ్ తో ఎంట్రీ ఇచ్చింది. ఈమె అక్క అనూష రంగనాథ్ కూడా ఒక నటి.. ఆషికా రంగనాథ్ మిస్ ఫ్రెష్ ఫేస్ 2014లో రన్నర్ అప్ గా నిలిచింది. 1996 ఆగస్టు 5వ తేదీన జన్మించిన ఈమె ఇప్పుడు కళ్యాణ్ రామ్ నటిస్తున్న అమిగోస్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే..
ఇదిలా ఉండగా అమిగోస్ చిత్ర విషయానికి వస్తే.. కళ్యాణ్ రామ్ ఇదివరకే బింబిసారా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆషికా రంగనాథ్ కూడా వరుస ఫోటోషూట్లతో యువతను తన వైపు తిప్పుకునేలా చేస్తోంది.. ఈ క్రమంలోని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఈ ముద్దుగుమ్మ ధరించిన చీర చూస్తే మాత్రం నిజంగా యువతకు చెమటలు పట్టడం ఖాయమని చెప్పవచ్చు. ట్రాన్స్పరెంట్ పింక్ కలర్ సారీ లో పాక్షికంగా ఎద అందాలను చూపిస్తూ ఫ్రెష్ లుక్కుతో యువతను మెస్మరైజ్ చేస్తోంది.
అమిగోస్ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికపై ఈవెంట్ కే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే ఆషిక ఈ కార్యక్రమానికి చాలా బ్యూటిఫుల్ గా తయారయ్యి రావడంతో అందరూ ఈమె వైపే తమ దృష్టిసారించారు. మొత్తానికైతే ఈ సినిమా ఈమె కెరీర్ కు ప్లస్ పాయింట్ కాబోతోంది అని కూడా చెప్పవచ్చు.