కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీలో ఎలాంటి ప్రత్యేకత లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అపాయింట్‌మెంట్ తీసుకున్న ప్రతిఒక్కరూ అమిత్ షాను కలవొచ్చని అన్నారు. అలాంటి విషయంలో తప్పుగా అపార్థాలు చేసుకోవద్దని అన్నారు. అమిత్ షా, ఈటల భేటీని రాజకీయం చేయొద్దని ఆయన పేర్కొన్నారు. కాగా, తాజాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించుకుని అమిత్ షా భేటీ అయ్యారు. దీంతో ఈ వార్త రాజకీయంగా పుకార్లు రేపుతోంది.
అమిత్ షా.. ఈటల రాజేందర్‌తో భేటి కావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈటలకు జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీకి రమ్మన్నట్లు సమాచారం. కాగా.. వచ్చే నెలలో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జోరుగా సాగనున్నాయి. ఈ సమావేశానికి ప్రధాని మోడీ హాజరు కానున్నారు. అయితే ఈ సభకు రికార్డు స్థాయిలో ప్రజలు వచ్చేలా బీజేపీ నేతలు చర్యలు తీసుకుంటున్నారు.