కేసీఆర్ అవినీతిని ప్రజలకు వివరించండి…! టీ బీజేపీ నేతలతో అమిత్ షా.

-

తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు అంశాన్ని తీవ్రతరం చేస్తోంది. దీన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ కూడా సిద్ధమైంది. తాజాగా ఇటు టీఆర్ఎస్ మంత్రులు, మరోవైపు టీ బీజేపీ నేతలు ఢిల్లీలో ఉన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తో తెలంగాణ బీజేపీ నేతలు భేటీకాగా.. ప్రస్తుతం టీఆర్ఎస్ మంత్రులు భేటీ అయ్యారు.

అంతకు ముందు తెలంగాణ బీజేపీ నేతలు కేంద్ర హోంమంత్రితో సమావేశమయ్యారు. ఈ భేటీకి మంత్రి పియూష్ గోయల్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలోని రాజకీయ పరిణామాలను తెలంగాణ బీజేపీ నేతలు అమిత్ షా ద్రుష్టికి తీసుకెళ్లారు.

ఈ సమావేశంలో అమిత్ షా బీజేపీ నేతలకు దిశానిర్థేశం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఆందోళనలకు అంతే రీతిలో సమాధానం ఇవ్వాలని బీజేపీ నేతలకు సూచించారు. కేసీఆర్ చేసే ప్రతీ ఆరోపణకు ధీటుగా సమాధానం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో బియ్యం కుంభకోణం, కేసీఆర్ అవినీతిపై విచారణకు డిమాండ్ చేయాలని, కేసీఆర్ అవినీతిపై ప్రజలకు వివరించాలని తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్థేశం చేశారు అమిత్ షా. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, డీకే అరుణ హాజరయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Latest news