యెమెన్ లో దారుణం చోటు చేసుకుంది. జైలు పై వైమానికి దాడి జరిగింది. ఈ వైమానిక దాడిలో దాదాపు 100 మందికి పైగా ఖైదీలు మృతి చెందారు. అలాగే పెద్ద సంఖ్య లో ఖైదీలు తీవ్రంగా గాయ పడ్డారు. కాగ ఈ ఘటన యెమెన్ లోని సాదా జైలు లో జరిగింది. ఈ వైమానికి దాడిలో 100 మందికి పైగా ఖైదీలు మృతి చెందారని.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ అధికార ప్రతినిధి బషీర్ ఒమర్ తెలిపారు.
అలాగే మరో 100 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. అయితే హౌతీ తిరుగుబాటు దారుల ఆధీనంలో ఉన్న సౌదీ రాష్ట్రంలోకి సహాయక బృందాలు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అలాగే మరి కొందరు క్షత గాత్రులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు తెలిపారు. అయితే యెమెన్ లోని సాదా జైలులో జరిగిన వైమానిక దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వైమానిక దాడిని ఉగ్రవాద సంస్థలు చేశాయా అని అధికారులు విచారణ జరుపుతున్నారు. కాగ ఇప్పటి వరకు ఈ దాడికి తమే కారణం అంటూ ఏ ఉగ్రవాద సంస్థలు ప్రకటించలేదు.