రాష్ట్రానికి ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాటు సారా తయారీయే వృత్తిగా ఉన్న వారికి ప్రత్యామ్నాయ జీవన ఉపాధి చూపించాలని అధికారులకి సూచించారు. పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక దృష్టిి పెట్టాలని ఆదేశించారు. పారదర్శకత, సులభతర విధానాల ద్వారా చెల్లింపుదారులకు సౌలభ్యంగా ఉండాలన్నారు.
అనుమతులు పొందిన లీధిదారులు మైనింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఇబ్బందులు తొలగించేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత, సులభతర విధానాలపై కమిటీని ఏర్పాటు చేశారు సీఎం జగన్. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో అధికంగా జీఎస్టీ సగటు వసుళు చేపట్టాలన్నారు.