పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికర ఘటన.. రాహుల్ గాంధీ ఏం చేశారంటే?

-

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న సందర్భంగా గౌతమ్ అదానీ అంశంపై చర్చ జరగాలని ప్రతిపక్ష ఇండియా కూటమి నిరసనలు చేపడుతున్నది. దీంతో సభాసమావేశాలు సజావుగా జరగడం లేదని స్పీకర్ ఓం బిర్లా కూటమి ఎంపీలపై మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిన్న సభ వాయిదా పడగా.. బుధవారం పార్లమెంట్ సమావేశాలు తిరిగి ప్రారంభం అయ్యాయి.

ఈ క్రమంలోనే పార్లమెంట్ ఆవరణలో ఓ ఆసక్తిరకర ఘటన జరిగింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్వయంగా వెళ్లి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కి జాతీయ జెండాను ఇచ్చారు. అదానీపై అమెరికాలో నమోదైన కేసు గు చర్చించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు వెలుపల కాంగ్రెస్ ఎంపీలు నిరసన ‌తెలిపారు. అదానీపై వచ్చిన లంచం ఆరోపణలపై చర్చలు జరపకుండా కేంద్రం తప్పించుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అదే టైంలో వచ్చి రక్షణ మంత్రి రాజ్ నాథ్ పార్లమెంటులోకి ప్రవేశిస్తుండా.. ఆయన్ను కాంగ్రెస్ ఎంపీలు చట్టుముట్టారు. తమ చేతుల్లేని జాతీయ జెండా, గులాబీ పువ్వుని ఆయనకు ఇచ్చేందుకు యత్నించారు.అయితే,రాహుల్ స్వయంగా వెళ్లి ఇవ్వడంతో వాటిని రాజ్ నాథ్ స్వీకరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version