యాంకర్​గా ఎంట్రీ ఇస్తున్నఅనసూయ చెల్లి.. మరి అక్క పరిస్థితి ఏంటో!

-

 

ఏ రంగంలో అయినా ఒకరు సక్సెస్ అయితే ఆ రంగంలోకి తమ కుటుంబ సభ్యులను తీసుకురావాలని భావిస్తారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో చాలా వరకు ఇదే కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది స్టార్స్​ తమ వాళ్లను చిత్రసీమకు పరిచయం చేశారు. అయితే తాజాగా ఈ జాబితాలోకి స్టార్ యాంకర్ అనసూయ సోదరి కూడా చేరనున్నట్లు తెలుస్తోంది.

యాంకర్ అంటే చలాకీ మాటలతో పాటు కాస్తా గ్లామర్ తో కూడా ఆకట్టుకుంటారు. ఆలాంటి గ్లామరస్ యాంకర్లలో బ్యూటిఫుల్ అనూసయ భరద్వాజ్ ఒకరు. బుల్లితెరపై పాపులర్ యాంకర్‌గా వెండితెరపై అద్బుతమైన నటిగా అందరి అభిమానాన్ని సంపాదించుకుంది. యాంకర్ గా షోలలో గ్లామర్ ఒలకబోస్తూనే వెండితెరపై తనదైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. అంతేకాకుండా డ్యాన్సులు చేయడంలోనూ అనసూయ తనకు తానే సాటి.

అయితే ఇప్పుడామె తన ఇద్దరు చెల్లెల్లో ఒకరైన వైష్ణవిని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. అందంలోనూ, చలాకీతనంలోనూ అనసూయని పోలి ఉండే వైష్ణవి.. అక్క బాటలోనే రాణించాలని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే వైష్ణవికి ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్​లో ప్రసారం కానున్న ఒక షో ద్వారా యాంకర్​గా ఎంట్రీ ఇచ్చే ఆఫర్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది కాలం వేచి ఉండాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version