తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లు రాజ్యమేలుతున్నారు: ప్రొఫెసర్ కోదండరాం

-

తెలంగాణలో లో ఆంధ్ర కాంట్రాక్టర్లు రాజ్యమేలుతున్నారు అని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు.బుధవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో పర్యటించిన ఆయన పోరాడి సాధించుకున్న రాష్ట్రం ఆంధ్ర పెత్తందారుల గుప్పిట్లోకి వెళ్ళిపోయింది అన్నారు. దీనంతటికీ కేసీఆరే కారణమని అన్నారు.ఉద్యమ పార్టీ అని ఆదరించి రెండుసార్లు అధికారంలోకి కూర్చోబెడితే కెసిఆర్ మాత్రం ఆంధ్ర పెత్తందారులు, గుత్తేదార్ల కోసమే పని చేస్తున్నారని మండిపడ్డారు.టిఆర్ఎస్ అంటే ఉద్యమ పార్టీ అని చెప్పుకునే కెసిఆర్..ఇవాళ తెలంగాణలో ప్రజా ఉద్యమాలను అణిచివేస్తున్నారని దుయ్యబట్టారు.

kodandaram tjs – Telangana Janasamithi

ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పిన ఆయన..ఇవాళ అదే ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని ఫైర్ అయ్యారు.కెసిఆర్ కు అధికారం మీద దాహం తప్ప ప్రజల కష్టాలు పట్టవని కోదండరామ్ విమర్శించారు.ఏదో రకంగా ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కెసిఆర్ నిత్యం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.జయశంకర్ ను కెసిఆర్ అవమానించారన్న ఆయన..జయశంకర్ ఆశయాల కోసం టీజేఎస్ పని చేస్తోందని స్పష్టం చేశారు.కెసిఆర్ మాటలు నమ్మి వరి వేయకుండా నష్టపోయిన రైతులకు రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కోదండరాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version