ఆంధప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు కావడంతో పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సీఎం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఉదయం 10గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అసెంబ్లీ, కౌన్సిల్ బీసీఏ సమావేశాలు జరుగుతాయి. 7వ తేదీన ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. 8వ తేదీ వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశముంది.
మరీ కొన్ని నెలల్లో పార్లమెంట్,అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలు 3 రోజులు మాత్రమే జరుగుతాయని సమాచారం. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ కూడా అవసరం లేదని, ఈ క్రమంలో ఒకే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం, అదే రోజు ఆమోదించడం చేసే ఆలోచనలో వైఎస్ జగన్ భావిస్తున్నట్లు సమాచారం.