- హిందువులను చులకనగా చూస్తే బీజేపీ సహించదు
- సీఎం జగన్ సర్కారుపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫైర్
అమరావతిః ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కారు రాష్ట్రంలోని హిందువులను చులకనగా చూస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని రాష్ట్ర కమళం చీఫ్ సోము వీర్రాజ్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సమాజంలో ఉన్న అందరినీ సమంగా హిందువులు గౌరవిస్తారని ఆయన తెలిపారు. అయితే, ఇటీవల రాష్ట్రంలో హిందువులు, హిందు ఆలయాలపై జరుగుతున్న దాడులను ఖండించారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శంచారు.
అలాగే, హిందువులు మతతత్వ వాదులు కారని సోము వీర్రాజు స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలు, నేతలపై దాడి చేస్తే అది హిందువులపై చేసే దాడి అని పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, అలాగే, హిందువులను మతతత్వ వాదులుగా చీత్రీకరిస్తున్న అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన వివరించారు. దీని కోసం రథయాత్రాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు.
రాష్ట్రంలో జరుగుతున్న హిందువులపై జరుగుతున్నదాడులు, హిందూ దేవాలయాల ధ్వంసంపై వచ్చే నెల 4 (ఫిబ్రవరి 4) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్రలు చేపడతామని తెలిపారు. ఈ రథయాత్రలు వారం రోజులపాటు కోనసాగుతాయనీ, వీటిని తిరుపతిలోని కపిలతీర్థం నుంచి విజయనగరంలోని రామతీర్థం వరకూ కొనసాగుతుందని సోము వీర్రాజు వివరించారు. బీజేపీతో పాటు జనసేన కూడా ఈ రథయాత్రలో పాలుపంచుకోనున్నదని తెలిపారు.