మెమోలో ఉన్నది ఒక్కటైతే.. విపక్షాలు మరొకటి ప్రచారం చేస్తున్నాయి : మంత్రి బొత్స

-

మెమోలో ఉన్నది ఒక్కటైతే.. విపక్షాలు మరొకటి ప్రచారం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. తాజాగా ఆయన విశాఖపట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా ఈసైన్, ఆధార్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై కూటమి అసత్య ప్రచారం చేస్తుంది. రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారు. వివాదాలకు తావు లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన చేశాం. 

దేశమంతా ఈ చట్టం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వమే సూచించింది. కూటమిలో ఉన్నప్పుడు అందరూ కలిసి  మేనిఫెస్టో ఇస్తారు. కానీ బీజేపీ మేనిఫెస్టో ఇవ్వలేదు. టీడీపీ-జనసేన పార్టీలు మాత్రమే ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చాయి. కూటమిలో ఒక పార్టీనే అంగీకరించని మేనిఫెస్టోను ప్రజలు ఎందుకు అంగీకరించాలని మంత్రి బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు ఇంతకు దిగజారుతారనుకోలేదన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version