రేపటి నుంచి పెన్షన్ల పంపిణీకి సిద్ధమవుతున్న ఏపీ ప్రభుత్వం..!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపటి నుంచి పెన్షన్ల పంపిణీకి  సిద్ధమవుతోంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీకి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో.. రేపు ఉదయం నుంచి గ్రామ సచివాలయాల వద్ద పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. కాగా.. వృద్ధులు, వికలాంగులకు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏప్రిల్ 6 లోపు పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ పెన్షన్ల పంపిణీ విషయంలో గత రెండు రోజులుగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ వద్దని.. ఎన్నికల విధుల నుంచి కూడా దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన పెన్షన్ల పంపిణీ చేసే అంశంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెన్షన్ల పంపిణీ విషయంలో జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలను ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని సెక్రటరీల ద్వారా ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేయొచ్చని పలువురు జిల్లాల కలెక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version