ఏపీ బీజేపీ నాయకుల గురించి విజయ సాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్..!

-

ఏపీ బీజేపీ నాయకుల గురించి విజయ సాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు గారు పార్టీ నిర్మాణానికి ఎంతో శ్రమించారు. పురంధేశ్వరి గారు కావాలని ఆయనను పూర్తిగా పక్కకు పెట్టారు. బహుశా కాపు అయినందువల్లో ఏమో వీర్రాజు గారి మాటకు కనీస విలువ ఇవ్వడం లేదంట. ఆయన హయాంలో రాజమండ్రిలో నిర్మించిన పార్టీ ఆఫీసును వదిలేసి ఆమె సొంత ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం, సొంత మనుషుల ద్వారా ప్రచారం నిర్వహించడం మొదటి నుంచి పార్టీలో ఉన్న క్యాడర్‌ను నమ్మకుండా అవమానించడమేనని అంటున్నారని ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి.

 

అలాగే ఎన్నికలలో టీడీపీ దుష్ప్రచారం రెండు రకాలుగా సాగుతోంది. ఒకటో రెండో రోడ్డు షోలు, సభలతో అలిసిపోయి విశ్రాంతి వాహనంలోకి వెళ్లిపోతున్నాడు చంద్రబాబు. అక్కడ హైదరాబాద్ నుంచి పత్రికలు, టీవీ చానళ్ళ ద్వారా ఆయనకు కొమ్ముకాస్తున్న ఎల్లో మీడియా పెద్దలకు మాత్రం రాత్రి పూట నిద్ర పట్టడం లేదట. ఈ ఆఖరి పోరాటంలో బాబుకు ఓటమి తప్పదనే ‘కమురు వాసన’ అక్కడివరకు వ్యాపించడం వారిని కలవరపాటుకి గురిచేస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version