చంద్రబాబుకి నోటీసులు వద్దని ఆపేసిన డీజీపీ…?

టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసుల జారీపై తర్జనభర్జన పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. డీజీపీ ఆదేశాల కోసం కర్నూలు పోలీసులు హైదరాబాద్ లో ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. నిన్ననే నోటీసులు ఇచ్చేందుకు సన్నాహాలు చేసారు. డీజీపీ నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో వెనక్కు తగ్గిన పోలీసులు… ఎప్పుడు నోటీసులు ఇస్తారు అనే దానిపై స్పష్టత లేదు.

కొత్త వైరస్ పై చేసిన వ్యాఖ్యలపై మంత్రి అప్పల రాజుపై టిడిపి శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా ఇప్పుడు ఏం చేయాలో అర్ధం కాని స్థితిలో ఉన్నారు. లాయర్ సుబ్బయ్య ఫిర్యాదుతో చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేసారు. టిడిపి నాయకుల కంప్లైంట్ ఆధారంగా మంత్రి అప్పలరాజు పైన కూడా కేసులు నమోదు చేస్తారని సర్వత్రా ఆ