చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని కోసం వేల ఎకరాలు భూములు ఇచ్చిన రైతులు తాజాగా జగన్ తీసుకున్న మూడు రాజధానులు నిర్ణయానికి రోడ్డు మీదకు వచ్చేయడం జరిగింది. దాదాపు నెల రోజులకు పైగానే అమరావతి ప్రాంతంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ధర్నాలు మరియు నిరసనలు చేస్తూ జగన్ సర్కార్ ను విమర్శిస్తూ ఉన్నారు.
ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కొత్తగా ఏర్పాటు చేయబోయే రాజధాని ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టడం కోసం రెడీ అయిందట. దీంతో విశాఖ ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయాలని త్వరగా పనులు చాలా ఫాస్ట్ గా అమరావతి నుండి తరలించే కార్యక్రమం మొదలు పెట్టిన జగన్ సర్కార్ విశాఖ ప్రాంతంలో భూములు సేకరించాలని ప్రయత్నాలు చేస్తుండగా ఆ ప్రాంతంలో ఉన్న రైతులు ఏపీ సర్కార్ కి తోడ్పడటం లేదట.
ఒకవేళ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి మా భూములను కూడా అమరావతి ప్రాంతంలో రైతు భూములను జగన్ చేసిన మాదిరిగా చేస్తే మా భవిష్యత్తు రోడ్డుమీద కి వచ్చేస్తుంది అన్న డైలమాలో పడ్డారట. దీంతో భూములను సేకరించాలని చూస్తున్న జగన్ సర్కార్ కి మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు విశాఖపట్నంలో కనబడుతున్నాయి.