నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం…బస్సును ఢీ కొట్టిన కంటైనర్‌..10 మంది !

-

నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును ఢీ కొట్టింది ఓ కంటైనర్‌. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నాయుడుపాలెం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్ బస్సును.. మినీ కంటైనర్ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఏకంగా 10 మంది ప్రయాణికులకు, డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అటు ఆరు గొర్రెలు కూడా మృతి చెందాయి.

దీంతో గాయాలైన వారిని నెల్లూరుకు తరలించారు స్థానికులు. కాకినాడ నుండి బెంగళూరుకు వెళుతున్న ఈ బస్సు బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. మినీ కంటైనర్ ముందు రోడ్డుకు అడ్డంగా గొర్రెలు రావడంతో..ఆ గొర్రెలను తప్పించేందుకు మినీ కంటైనర్ ను స్లో చేశాడు డ్రైవర్‌. ఈ తరుణం లోనే.. ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version