మస్ట్ రీడ్: లడ్డూల మాటలు… మళ్లీ బాబుతో పవన్!

-

చంద్రబాబు రాజకీయం ఓ పట్టాన్న ఎవరికీ అర్ధం కాదు! ఎవరికి ఏ మందు పెడతారో తెలియదు కానీ… ఆయన ఛీ అన్నవాళ్లు, ఆయన్ని ఛీ ఛీ అన్నవాళ్లు మళ్లీ కలిసి హాయిగా బండి నడిపించేస్తుంటారు! ఇందుకు బీజేపీ, కాంగ్రెస్, కమ్యునిస్టులు… ఎవరూ అతీతులు కాదు! లేటెస్ట్ గా జనసేన?

బీజేపీతో కలవడం చారిత్రక తప్పిదం… మళ్ళీ వారితో కలిసే ప్రసక్తి లేదు.. ఛీ అన్నారు చంద్రబాబు! మరి వారికి లేదో వీరికి లేదో తెలియదు కానీ… మళ్ళీ కలిసి పోటీ చేశారు! ఇంతలోనే ఐదేళ్లు ముగిసేలోపు మళ్లీ నువెంతంటే నువ్వెంతనుకున్నారు! 2019 ఎన్నికల ఫలితాల్లో మోడీ దూసుకుపోగా, బాబు సైకిల్ టైర్ పంక్చర్ అయ్యింది.. చైన్ ఊడిపోయింది.. బ్రేకులు తెగిపోయాయి.. బెల్ పాడైపోయింది.. రిమ్ములు రిగిపోయాయి! దీంతో… మళ్లీ మోడీ దగ్గర గారం పడుతున్నారు బాబు!!

ఆ సంగతి అలా ఉంటే… కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం! తెలుగు వాడి ఆత్మగౌరవం కోసం తలపెట్టిన పార్టీ! మరి అలాంటి టీడీపీని పట్టుకెళ్లి సోనియా “హస్తం”తో కలిపారు చంద్రబాబు! పెద్దాయనకు స్వర్గంలో కూడా ప్రశాంతంగా ఉండనీయకుండా!! ఇక అప్పుడే పుట్టిన పిల్ల పార్టీ జనసేన.. ఏపీలో రాజకీయంగా ప్లస్ అవుతుందని పవన్ ఇంటికి వెళ్లారు.. టీ తాగి.. నాలుగు కబుర్లు చెప్పి.. బుట్టలో వేసుకున్నారు! ఫలితంగా 2014 ఎన్నికల్లో గెలవడానికి భరోసా దొరికింది! అనంతరం మళ్లీ విడిపోయారు!

ఇప్పుడు బాబును మించిన… అన్నట్లుగా నడుచుకుంటున్న పవన్… మరి ఆయనకు ప్రత్యేకంగా ఏమైనా తియ్యగా ఉన్న లడ్డూలు, ఫ్రెష్ లడ్డూలు, నేతితో చేసిన లడ్డూలు తినిపిస్తున్నారో ఏమో తెలియదు కానీ… పాచిపోయిన లడ్డూలు ఇచ్చిన బీజేపీతో జతకట్టారు! పవన్ ఎక్కడున్న ఎవరితో ఉన్నా మనసంతా బాబుపైనే ఉంటుందనేది చాలామంది చెప్పే మాట! ఆ మాటలకు బలం చేకూరుస్తూ మరో నిర్ణయం తీసుకున్నారు పవన్!

తనకు ఆశ్రయం ఇచ్చిన పార్టీ మూడు రాజధానులకు అనుకూలంగా సమేతాలు ఇస్తుంటే… ఆయన మాత్రం అమరావతే రాజధానిగా ఉండాలని, ఒకటే రాజధాని ఉండాలని అంటున్నారు! అంటే… ఆ స్టేట్ మెంట్ బీజేపీది కాదు – చంద్రబాబుది!! అంటే… బీజేపీతో జతకట్టి అన్ని రకాలుగానూ బలపడిన అనంతరం మళ్లీ ఎన్నికల నాటికి టీడీపీతో జతకట్టాలని పవన్ భావిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు! మరి ఈ దత్తపుత్రుడి ప్రేమ ఏ మేరకు నిలబడుతుంది అనేది వేచి చూడాలి!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news