ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. కొత్త జీతాల వివరాలు ఇలా తెలుసుకోవచ్చు

-

ఏపీ ఉద్యోగులకు జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. జనవరి నెల జీతాలను కొత్త పే స్కేలు ప్రకారమే అమలు చేసినట్లు ఏపీ ఆర్ధిక శాఖ వెల్లడించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు 2022 రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం చెల్లించనున్నట్టు స్పష్టం చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లు తమ పే స్లిప్పులను పేరోల్ డాట్ హెర్బ్ డాట్ ఏపీ సీఎఫ్ ఎస్సెస్ వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది ఆర్ధిక శాఖ.

ప్రతీ ఉద్యోగి మొబైల్ ఫోన్ కు కూడా జీతాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం పంపినట్లు వెల్లడించింది ఆర్ధిక శాఖ. ఉద్యోగులు, పెన్షనర్లు తమ పే స్లిప్‌ లను ఆన్‌ లైన్‌ ద్వారా డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది. ఉద్యోగుల మొబైల్స్‌ కు వేతనానికి సంబంధించి.. మెసేజ్‌ రూపంలో సమాచారం వస్తుందని పేర్కొంది. అలాగే.. ఉద్యోగుఉ, పెన్షనర్లు కొత్త పీఆర్సీ ప్రకారం తమకు వచ్చే పేస్కేల్‌ ను ప్రత్యేక మొబైల్‌ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది ఆర్థిక శాఖ.

Read more RELATED
Recommended to you

Exit mobile version