మంత్రి రోజా పెద్ద ఐరన్ లెగ్ – వైసీపీ నేతలు

-

Minister Roja: మంత్రి రోజా పెద్ద ఐరన్ లెగ్ అంటూ వైసీపీ నేతలు ఫైర్‌ అయ్యారు. రోజాపై మరోసారి నగరి వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. రోజా ఒక ఐరన్ లెగ్… ఆమెను మా నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చెబితే గెలిపించామన్నారు. పుత్తూరు నేత అమ్ముల్లు మాట్లాడుతూ…రోజా భర్త సేల్వమణి ఎవరు ? మాకు పదవులు ఇవ్వడానికి..మాకు పదవులు ఇచ్చింది పార్టీ పెద్దలు అన్నారు.

allegations on Minister Roja

అప్పుల్లో కూరుకుపోయి రోజా…. ఇప్పుడు మంత్రి అయ్యాక ఎంత సంపాదించిందో అందరికీ తెలిసిందంటూ ఆరోపణలు చేశారు. ఐరన్ లెగ్ రోజాను మేము గోల్డెన్ లెగ్ గా మార్చామన్నారు. పుత్తూరులో ఎక్కడ చూసినా భూ కబ్జాలు, దౌర్జన్యాలు ,దోపిడిలు జరుగుతున్నాయని ఫైర్‌ అయ్యారు. ఇంత అవినీతి ఎమ్మెల్యేను ఎక్కడ చూడలేదు…పార్టీ పెద్దలు వారికి సీటు ఇవ్వకూడదని డిమాండ్‌ చేశారు. కోట్లు ఖర్చుపెట్టి అమె గెలిపించాము…ఇప్పుడు మమ్మల్ని వేదిస్తోందని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version