వైఎస్ విజయమ్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ప్లీనరీ సాక్షిగా ప్రకటించారు వైఎస్ విజయమ్మ.అయితే ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. విపక్షాలు అయితే దుమ్మెత్తి పోస్తున్నాయి. మరోవైపు స్వపక్షం లో విపక్షంలా మెలుగుతున్న రఘురామకృష్ణంరాజు కూడా స్పందించారు. ఈ విషయం తాను ఊహించిందే అని చెప్పారు. వైసిపి ప్లీనరీ సమావేశం విజయలక్ష్మి వీడ్కోలు సభలా ఉందని రఘురామకృష్ణంరాజు అన్నారు. అమ్మ రాజీనామానా.. అమ్మతో రాజీనామానా? అని అందరూ అడుగుతున్నారు అని తెలిపారు.
విజయమ్మ రాజీనామా చేస్తారని తాను ముందే చెప్పానని అన్నారు రఘురామ. అమ్మ రాజీనామా కరెక్ట్.. అమ్మతో రాజీనామా కూడా కరెక్టు అని కామెంట్ చేశారు. జగన్ జైలులో ఉన్నప్పుడు దేహీ అంటూ విజయలక్ష్మి తిరిగారని రఘురామ గుర్తుచేశారు. కొడుకు బెయిల్ కోసం విజయలక్ష్మి సోనియా కాళ్లు పట్టుకున్నారని సమాచారం ఉందన్నారు. పార్టీ అధ్యక్షుడు ఎన్నికలు జరగాలని, ఎన్నికలు లేకపోతే పదవిలో ఐదు ఏళ్ళు మాత్రమే ఉండాలని చెప్పారు రఘురామరాజు. పార్టీ శాశ్వత అధ్యక్ష ఎంపికపై కోర్టుకు వెళతానని తెలిపారు.