ప్రతిపక్షాలు కోనసీమ ఘటనను ఖండిస్తాయని భావించాను కానీ అలాంటిదేం జరగలేదని మంత్రి అంబటి రాంబాాబు అన్నారు. తుని ఘటనలకు కోనసీమ ఘటనకు ముడిపెడుతున్నారని విమర్శించారు. మంత్రి విశ్వరూప్ ఇంటిని, ఎమ్మెల్యే సతీష్ ఇంటిని మేమే తగలబెట్టుకుంటామా..? అని ప్రశ్నించారు. మంత్రి ఇంటిని కాల్చేసి ఏపీని శ్రీలంకలా తయారైందని చూపించే ప్రయత్నం చేస్తున్నారని అంబటి ఫైర్ అయ్యారు. కనీసం ఫైర్ ఇంజిన్ రాకుండా అడ్డుకున్నారని అంటి అన్నారు. దాడులను ఖండించకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడకుండా.. ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు.
టీడీపీ, జనసేన పార్టీలను విమర్శించారు. చంద్రబాబు మాటలనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడని అంబటి విమర్శించారు. రాష్ట్రంలో హింసా కాండను క్రియేట్ చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. మా ప్రభుత్వంలో మేం లా అండ్ ఆర్డర్ ని పాడు చేసుకుంటామా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిస్థితులు మాకు అనుకూలంగా ఉన్నాయని..150 సీట్లతో అధికారంలోకి వచ్చామని గుర్తు చేశారు. ఘటన వెనక ఎంతటి వారున్నా ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుందని అంబటి అన్నారు.