బాబు కొత్త పొత్తు: వైసీపీ-బీజేపీకి చెక్ పెట్టేలా!

-

టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా ఎప్పటికప్పుడు అవసరాలకు తగ్గట్టుగా స్ట్రాటజీలు మార్చడంలో ధిట్ట అని చెప్పొచ్చు. అసలు రాజకీయంగా బలపడటానికి బాబు ఎలాంటి నిర్ణయమైన తీసుకుంటారు..అలాగే రాజకీయంగా ఎవరితోనైనా జట్టు కట్టడానికి వెనుకడారు..అంటే అధికారంలోకి రావడం కోసం ఏదైనా చేస్తారని చెప్పొచ్చు. ఆఖరికి బద్ధశత్రువైన కాంగ్రెస్‌తో సైతం బాబు పొత్తు పెట్టుకున్నారు…కానీ ఆ పొత్తు విఫలమైన విషయం తెలిసిందే..సరే పొత్తు విఫలమన సరే పొత్తు పెట్టుకోకుండా బాబు మాత్రం ఉండరు…ఇప్పుడు ఏపీలో నెక్స్ట్ అధికారంలోకి రావడమే లక్ష్యంగా బాబు ముందుకెళుతున్నారు.

నెక్స్ట్ జగన్‌కు చెక్ పెట్టాలంటే..ఖచ్చితంగా బాబుకు పవన్ కల్యాణ్ సపోర్ట్ కావాలనే చెప్పొచ్చు…అందుకే ఆయన, పవన్‌తో కలిసి ముందుకెళ్ళేందుకు చూస్తున్నారు..పవన్‌ని కలుపుకుంటేనే జగన్‌కు చెక్ పెట్టగలమని భావిస్తున్నారు.. అందుకే చాలా కాలం నుంచి పవన్‌తో పొత్తు కోసం బాబు ట్రై చేస్తున్నారు.

అటు పవన్ సైతం బాబుతో కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు..కాకపోతే పవన్, బీజేపీతో కలిసి ఉన్నారు…అలాంటప్పుడు బాబు, బీజేపీ-జనసేనలతో పొత్తు పెట్టుకోవాలి. కానీ బీజేపీ మాత్రం బాబుతో కలిసేందుకు ఇష్టపడటం లేదు. ఇటు టీడీపీ శ్రేణులు సైతం బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు..అసలు బీజేపీ అంటేనే తమ్ముళ్ళు ఫైర్ అయిపోతున్నారు. అంటే బీజేపీతో టీడీపీతో పొత్తు ఉండదని తెలుస్తోంది.

అయితే జనసేనతో మాత్రం ఖచ్చితంగా ముందుకెళ్లాలని బాబు భావిస్తున్నారు…ఇక బీజేపీతో పొత్తు ఉండదు కాబట్టి…బాబు కమ్యూనిస్టులతో కలిసి ముందుకెళ్ళేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఏపీలో బీజేపీతో పోలిస్తే కమ్యూనిస్టులకే కాస్త బలం ఎక్కువ ఉంది…కాబట్టి వారితోనే కలిసి ముందుకెళితే బెటర్ అని అనుకుంటున్నారు. అందుకే బాబు కొత్త పొత్తు దిశగా వ్యూహం రచించారని తెలుస్తోంది. అంటే జనసేన-కమ్యూనిస్టులతో నెక్స్ట్ ఎన్నికల బరిలో నిలవాలనేది బాబు ప్రయత్నం. అయితే ఈ పొత్తు సక్సెస్ అవుతుందా? లేదా? అనేది చెప్పలేం…అలాగే పొత్తు కుదురుతుందో లేదో కూడా చెప్పలేం…కానీ బాబు ఆ దిశగానే ముందుకెళుతున్నారని అర్ధమవుతుంది. చూడాలి మరి బాబు పొత్తు రాజకీయాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో.

Read more RELATED
Recommended to you

Latest news