సీఎం జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా విరుచుకుపడ్డారు. తన పతనం కళ్ల ముందే జగనుకు కనిపిస్తోందని.. ఎన్నికలకు సింగిల్ గా వెళ్తాడో లేక ఎంపీ గోరంట్ల మాధవ్ లా గుడ్డలు విప్పుకుని వెళ్తాడో అది జగన్ ఇష్టం అని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం-జనసేనలు ఎలా ఎన్నికలకు వెళ్ళాలో చెప్పటానికి జగన్ ఎవరు? అని ప్రశ్నించారు.
తెలుగుదేశం-జనసేనలు కలిసి వెళ్తే వైసీపీకు సింగిల్ డిజిట్ కూడా రాదని ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేధిక జగన్ను కలవరపెడుతోందని మండిపడ్డారు. జగనుకు ఏమైంది, ఆయన ముఖంలో కళ లేదేంటని వైసీపీ నేతలే చెప్పుకుంటున్నారని.. ఎత్తులు, జిత్తులకు కేరాఫ్ అడ్రస్ జగన్ అని తెలిపారు. సీబీఐకి దేశమంతా భయపడుతుంటే, జె గ్యాంగును చూసి సీబీఐ భయపడుతోందని ఆగ్రహించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా.