నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన సీఎం జగన్ రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి కుప్పంకు చేరుకున్నారు. సీఎం హోదాలో ఆయన కుప్పంలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో కుప్పం నియోజకవర్గంలోని అనిమిగానిపల్లి లో వైఎస్ఆర్ చేయూత మూడో విడత నగదు జమ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. కుప్పం అంటే చంద్రబాబు పరిపాలన కాదని, కుప్పం అంటే అక్క చెల్లెల అభివృద్ధి, కుప్పం అంటే ఎస్టి, ఎస్సీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి అని అన్నారు. వరుసగా మూడో ఏడాది వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల చేశామన్నారు సీఎం జగన్. అంతేకాదు కుప్పం నుంచి మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
రాష్ట్రంలో పెన్షన్ల మొత్తాన్ని పెంచుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. వచ్చి ఏడాది జనవరి నుంచి రూ.2,750 నుంచి పెన్షన్ అందించనున్నట్లు సీఎం జగన్ కుప్పం సభలో తెలిపారు. దీంతో ప్రస్తుతం రూ. 2500 ఉన్న పెన్షన్ రూ. 2,750 కానుంది.