కేశినేని పై బుద్దా వెంకన్న సంచలన ట్వీట్..!

-

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన కేశినేని నాని పై బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు. కేశినేని నాని కోవర్టు అని తాను గతంలోనే చెప్పానని గుర్తుకు చేశారు. ఆయన కోవర్టు అనే విషయం తెలియక టీడీపీ అధినేత చంద్రబాబు గౌరవించారని చెప్పారు. కోవర్టు అని తెలుసు కాబట్టే.. కేశినేని నానిని జగన్ అగౌరవించారని బుద్దా వెంకన్న ఓ వీడియో ట్వీట్ చేశారు.

సతీసమేతంగా ఆలయ దర్శనం తరువాత చంద్రబాబు బయటికీ వస్తుండగా కేశినేని నాని దూరంగా ఎక్కడో ఉండటం వీడియోలో కనిపించింది. అయితే తన పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి కేశినేని నానిని చంద్రబాబు దగ్గరకు పిలిపించుకోవడం కనిపిస్తోంది. దూరంగా ఉన్న వ్యక్తిని పిలిపించుకుని చంద్రబాబు తన పక్కన చోటిచ్చి గౌరవించారని బుద్దా వెంకన్న చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version