ఏపీ ప్రజలకు అలర్ట్.. ఆస్తుల దస్తావేజుల రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ద్వారా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానాన్ని వచ్చే నెల 15 నాటికి దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. IGRS వెబ్సైట్ ద్వారా కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ ను సులువుగా పూర్తి చేసుకోవచ్చు.
20 నిమిషాల్లో దస్తావేజులు తిరిగి పొందవచ్చు అని వెల్లడించింది. పాత విధానం కూడా కొనసాగుతుందని వివరించింది. కాగా, డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర బ్యాంకర్ల సమావేశంలో చేసిన విజ్ఞప్తితో ఇప్పటికే ఎస్బిఐ వడ్డీ తగ్గించిన సంగతి తెలిసిందే. తాజాగా కెనరా బ్యాంకు కూడా ఆమోదం తెలిపింది.