తెలుగుదేశం ఇకపై అన్‌స్టాపబుల్‌: చంద్రబాబు

-

తెలుగుదేశం పార్టీ ఇకపై అన్‌స్టాపబుల్ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సైకిల్ గేరు మార్చి స్పీడ్‌ పెంచిందని చెప్పారు. ఎవరైనా.. అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళ్తామని స్ట్రాంగ్ గా హెచ్చరించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైస్సార్సీపీ  దిమ్మ తిరిగిందన్న చంద్రబాబు.. ఆ  దెబ్బ నుంచి కోలుకోకముందే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో షాక్‌ తగిలిందని అన్నారు.

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువుకున్న వాళ్లు తమకు ఓట్లేయరని ఆ పార్టీ నేతలే చెప్పేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. వైస్సార్సీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ మీద నమ్మకం లేదని అన్నారు. రాష్ట్రంలో జగన్ చేసిన విధ్వంసం వల్ల 30ఏళ్లు వెనక్కు వెళ్లామని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు చేయడం, రాష్ట్రాన్ని దోచుకోవడమే జగన్ పని అని చంద్రబాబు దుయ్యబట్టారు.

దేవుడు స్క్రిప్ట్ తిరగరాశాడని చంద్రబాబు అన్నారు. 23వ తేదీన 23వ సంవత్సరం 23 ఓట్లతో తమ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలిచిందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ గాల్లో పల్టీలు కొట్టాడని ఎద్దేవా చేశారు. ఎంతో కసరత్తు చేసినా.. చివరికి బొక్కా బోర్లా పడ్డారని విమర్శించారు. జగన్​పై చాలా మంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందని.. కేవలం నలుగురు మాత్రమే తమ అసంతృప్తిని బయటపెట్టారని విమర్శించారు. బయటకు రాని ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారని తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news