గ‌తంపైనే బాబు దృష్టి.. ఫ్యూచ‌ర్ మాటేంటి?

-

టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ‌తం బాట ప‌ట్టారు. అదేంటి అనుకుంటున్నారా ? ప‌్ర‌స్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో ప్ర‌జ‌లు, నాయ‌కులు కూడా ఇంటికే ప‌రిమిత‌మైన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు కూడా హైద‌రాబాద్‌లో ఇంటికి ప‌రిమిత‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు ఒక్క‌సారిగాగ‌తం తాలూకు విష‌యాలు జ్ఞాప‌కం వ‌చ్చాయి. దీంతో ఆయ‌న వెంట‌నే గ‌తంలోకి వెళ్లిపోయారు. ఏడేళ్ల క్రితం టీడీపీ అధి నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ‘వస్తున్నా…మీకోసం’ పాదయాత్రకు నేటితో ఏడేళ్లు పూర్త య్యాయి. ఈ సందర్భంగా ఆనాటి సంఘటనలను చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

‘‘ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని కలిసి మీకు నేనున్నా అనే భరోసా ఇవ్వడం కోసం ‘వస్తున్నా.. మీకో సం’ పేరుతో నేను చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర ఏడేళ్ళ క్రితం ఇదే రోజున విశాఖలో ముగిసింది. సుమారు 7 నెలల పాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ 62 ఏళ్ళ వయసులో 2,817 కిలోమీటర్లు నడిచా. నాటి పాదయాత్రలో నేను స్వయంగా తెలుసుకున్న ప్రజల కష్టాలను తీర్చడానికి గత ఐదేళ్ళ పాలనలో రోజుకు 18 గంటలు పనిచేసా. 208 రోజులు 16 జిల్లాల్లో సాగిన ‘వస్తున్నా… మీకోసం’ పాదయాత్రలో అడుగ డుగునా నా వెన్నంటి నిలిచి, నాకు స్ఫూర్తినిచ్చిన కార్యకర్తలు, నేతలు, ప్రజలందరికీ ధన్యవాదాలు’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ప్ర‌స్తుతం కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చేందుకు ఆయ‌నేమ‌న్నా ప్లాన్ చేస్తు న్నారా? అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే, గ‌తం సంగ‌తి స‌రే.. కానీ, ఫ్యూచ‌ర్ మాటేంట‌ని టీడీపీలోనే చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం టీడీపీ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని, కొన్ని జిల్లాల్లో పార్టీని నాయ కులు కూడా లేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని, ఈ స‌మ‌యంలో బాబు వ్యూహాత్మ‌కంగా ఫ్యూచ‌ర్‌పై దృష్టి పెట్టాల్సి న అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. కానీ, ఆయ‌న మాత్రం ఎక్క‌డా ఫ్యూచ‌ర్‌పై దృష్టి పెట్ట‌డం లేదు. నిజానికి ఈ విష‌యంలో టీడీపీ నేత‌లు మ‌ద‌న ‌ప‌డుతున్నారు. మ‌రి బాబు గ‌తాన్ని వ‌దిలి ప్యూచ‌ర్‌లోకి ఎప్పుడొస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news