రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు సత్యాగ్రహ దీక్ష

-

టిడిపి అధినేత చంద్రబాబు సత్యాగ్రహ దీక్ష కు సిద్ధం అయ్యారు. నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో. రిమాండ్ లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు సత్యాగ్రహ దీక్ష చేయనున్నారు. గాంధీ జయంతిని పురస్కారించుకుని స్కిల్ స్కాంలో అక్రమ అరెస్ట్ లో న్యాయం కోరుతూ దీక్ష కు దిగనున్నారు టిడిపి అధినేత చంద్రబాబు.

ఇక అటు రాజమండ్రి సెంట్రల్ జైలులోని టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్ 23వ రోజుకు చేరింది. స్కిల్ డవలప్ మెంట్ స్కాం కేసులో ఈనెల 9వ తేదీన అరెస్టయిన చంద్రబాబు…ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైలులో సత్యాగ్రహ దీక్ష చేయనున్నారు.

ఇక అటు నేడు గాంధీ జయంతిని పురస్కరించుకుని న్యాయం కావాలని కోరుతూ రాజమండ్రిలో నారా భువనేశ్వరీ రిలే నిరాహారదీక్ష చేయనున్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఉదయం నుంచి సాయంత్రం వరకు భువనేశ్వరీ దీక్ష కొనసాగనుంది. భువనేశ్వరి దీక్షకు మద్దతుగా భారీగా టిడిపి శ్రేణులు దీక్షకు దిగనున్నారు. అటు ఢిల్లీలో సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version