ఈనెల 29న గుడివాడకు చంద్రబాబు

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 29న గుడివాడలో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే మినీ మహానాడు లో టిడిపి అధినేత పాల్గొంటారు. ఈ క్రమంలో చంద్రబాబు బహిరంగ సభ స్థలాలను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టిడిపి నేతలు బుధవారం ఉదయం పరిశీలించారు. గుడ్లవల్లేరు, గుడివాడ మండలాల్లో నాలుగు ప్రాంతాలను రవీంద్ర పరిశీలించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లక్షలాది మందితో గుడివాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. సాయంత్రానికి బహిరంగ సభ ప్రాంతాన్ని ప్రకటిస్తామన్నారు. చంద్రబాబు బహిరంగ సభలో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 30 న మచిలీపట్నంలోని ఓ కళ్యాణ మండపంలో కృష్ణా జిల్లా టిడిపి నాయకులతో చంద్రబాబు సమావేశం అవుతారని కొల్లు రవీంద్ర వెల్లడించారు.