BREAKING : డిప్రెషన్‌ లోకి వెళ్లిన చంద్రబాబు…జైలు జీవితం గడుపలేక!

-

BREAKING : రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు డిప్రెషన్‌ లోకి వెళ్లినట్లు సమాచారం అందుతోంది. జైలు జీవితం గడుపలేక చంద్రబాబు కు స్వల్ప అస్వస్థత నెలకొందని సమాచారం అందుతోంది. ఈ తరుణంలోనే.. రాజమండ్రి జైలులో డీహైడ్రేషనుతో ఇబ్బంది పడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు.

Chandrababu who went into depression

తీవ్ర ఉక్కపోతతో డీహైడ్రేషన్ కు చంద్రబాబు గురయ్యారు. దీంతో వైద్యులకు సమాచారం ఇచ్చిన చంద్రబాబు…తనకు మంచి సౌకర్యాలు కల్పించాలని కోరారట. ఇది ఇలా ఉండగా, ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో మాజీ మంత్రి నారా లోకేశ్ ను సీఐడీ నిన్న సుదీర్ఘంగా ప్రశ్నించింది. నిన్న ఉదయం లోకేశ్ తాడేపల్లి సిట్ కార్యాలయానికి విచ్చేశారు.

ఉదయం 10 గంటల తర్వాత విచారణ మొదలవగా, సాయంత్రానికి విచారణ ముగిసింది. వాస్తవానికి అక్టోబరు 4నే విచారణకు హాజరు కావాలని సీఐడీ లోకేశ్ కు నోటీసులు పంపింది. అయితే, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో లోకేశ్ ను విచారించారు. లోకేశ్ ను 50 ప్రశ్నలు అడిగారు. కాగా, మరింత సమాచారం కోసం ఇవాళ మరోసారి విచారణకు రావాలని నారా లోకేశ్ కు 41ఏ నోటీసులు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version