తెల్లరేషన్ కార్డు ఉంటే చంద్రబాబు మనవడికి కూడా అమ్మఒడి పథకాలు ఇస్తాం – మాజీమంత్రి వెల్లంపల్లి

-

తమ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా పథకాలు అందిస్తుందని అన్నారు మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. విజయవాడ పశుమ నియోజకవర్గంలో చేపట్టిన గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలోంలో టిడిపి పోలీస్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఇంటికి వెళ్లారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఈ సందర్భంగా వర్ల రామయ్య భార్య జయప్రదకు రైతు భరోసా కింద 13,500 రూపాయలు అందినట్లుగా ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

ధ్రువీకరణ పత్రాన్ని వర్ల రామయ్య డ్రైవర్ కి అందజేశారు వెల్లంపల్లి శ్రీనివాస్. టిడిపి నేతలకు కూడా మా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని అన్నారు వెల్లంపల్లి. పార్టీలకు అతీతంగా తమకు ఓటెయ్యని వారికి కూడా పథకాలు అందించాలని సీఎం జగన్ చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబు మనవడు దేవాన్ష్ కు కూడా తెల్ల రేషన్ కార్డు ఉంటే అమ్మ ఒడి, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు అందిస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version