తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిరకాల డిమాండ్ నేరవేర్చారు సీఎం జగన్. కాసేపటి క్రితమే.. ఏపీలోని 26 జిల్లాలను ప్రారంభించారు సీఎం జగన్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ… కుప్పం స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు.. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నా…రెవెన్యూ డివిజన్ కూడా చేసుకోలేక పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుప్పం స్థానిక ఎమ్మెల్యే రెవెన్యూ డివిజన్ కావాలని కోరటంతో కుప్పంను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేశామని ప్రకటన చ ఏశారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశామని.. పాలనా వికేంద్రీకరణే ప్రజలకు మేలు చేస్తుందని పేర్కొన్నారు.
గ్రామం నుంచి రాజధానుల వరకు ఇదే మా విధానమని.. 15 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ గా జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు సీఎం జగన్. ప్రజల విజ్ఞప్తుల మేరకు జిల్లాల్లోనూ కొన్ని మార్పులు చేశామని.. 12 నియోజకవర్గాలలో మండలాలను స్ప్లిట్ చేసి రెండు జిల్లాల్లో పెట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు.