సచివాలయంలో గనులశాఖపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు.ప్రభుత్వానికి ఖనిజ ఆధారిత ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మైనింగ్ లీజుల విషయంలో పారదర్శక విధానం…లీజుల జారీలో అనవసరపు జాప్యంకు చెక్ పెట్టాలన్నారు. అటవీ, పర్యావరణ అనుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని…ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయంకు కృషి చేస్తానని చెప్పారు.
గనులశాఖకు లైజనింగ్ బాధ్యతలు తీసుకున్నామని…పెండింగులో ఉన్న లీజులపై సమీక్షిస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని మైనింగ్ లీజులను అమల్లోకి తీసుకురావాలి…రాష్ట్ర వ్యాప్తంగా 5146 మైనర్ మినరల్ మైనింగ్ లీజులు ఉన్నాయని వెల్లడించారు. వీటిల్లో 2276 లీజులకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయి…మరో 277 లీజులకు సంబంధించి 133 లీజులకు అనుమతులు పొందే అవకాశం ఉందన్నారు.
మిగిలిన 144 లీజులకు సంబంధించి అనుమతుల విషయంలో సమస్యలు ఉన్నాయని..నాన్ వర్కింగ్ లీజుల్లో అధికారుల చొరవతో 83 లీజుల్లో మైనింగ్ ప్రారంభించామని వెల్లడించారు. మైనింగ్ జరుగుతున్న క్వారీల నుంచి వచ్చే వ్యర్థాలను అటవీ భూముల్లో వదిలేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.