సీఎం జగన్ దళితులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు – నక్కా ఆనంద్ బాబు

-

అధికారంలోకి వచ్చేందుకు దళితుల పట్ల జగన్ కపట ప్రేమను చూపించారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు టిడిపి సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ కు ఓట్లేసి ముఖ్యమంత్రిని చేసినసిన పాపానికి దళితులంతా ఎవరికి వారు చెప్పుతో కొట్టుకునే పరిస్థితి ఏపీలో నెలకొందని అన్నారు. దళితులు ఓట్లు వేసి అందలం ఎక్కించినందుకు ఇదా మీరిచ్చే బహుమానం అని ప్రశ్నించారు.

దళితులకు ఉన్న పథకాలను రద్దు చేశారని.. వారి పట్ల చులకన భావం వీడాలన్నారు. అనంతపురం కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ దళితుడు కావడం వల్లే అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టారని, ఉద్యోగం నుంచి తీసేసేంతవరకు ఆయన పట్ల కక్షపూరితంగా వ్యవహరించాలనిని మండిపడ్డారు. దళిత కానిస్టేబుల్ కు చట్టబద్ధంగా న్యాయం చేయకపోతే ఆందోళన చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ దళితులకు ఎప్పుడు అండగా ఉంటుందని నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version