రేపు గుడివాడకు సీఎం జగన్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న (రేపు) కృష్ణాజిల్లా గుడివాడలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడ నిర్మించిన టిడ్కో ఇళ్లను ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుండి సీఎం జగన్ బయలుదేరనున్నారు. తాడేపల్లి నుండి గుడివాడ మండలం మల్లాయపాలెం చేరుకొని అక్కడ టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించి.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించి.. తిరిగి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. కృష్ణాజిల్లాలో 27,872 ఇల్లు నిర్మిస్తున్నారు. వాటిలో ఒక్క గుడివాడ లోనే 8,912 ఇల్లు నిర్మిస్తున్నారు. ఇది రాష్ట్రంలోనే అతి పెద్దది. గుడివాడ సమీపంలో 300 ఎకరాలలో 8,912 ఇళ్లను నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version