ఏపీలో మంగళవారం జూన్ 4 ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవుతుందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య ఏ పార్టీకి మెజారిటీ అనే దానిపై స్పష్టత వస్తుందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.
కొవ్వూరు, నరసాపురం ఎమ్మెల్యే స్థానాలకు 5 గంటల్లో ఫలితాలు వెలువడతాయన్నారు. అమలాపురం లోక్ సభకు 27 రౌండ్లు ఉండటంతో రిజల్ట్స్్క 9 గంటల టైం పడుతుందన్నారు. ఆర్వో, నరసాపురం స్థానాలకు 5గంటల్లో ఫలితాలు వస్తాయని చెప్పారు. ఏపీలో జనవరి 1 నుంచి జూన్ 2 వరకు మొత్తం రూ.483.15 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.