సీఎం జగన్ కాళ్లను మొక్కుతా..అది నా ఇష్టం అని.. డిప్యూటీ సీఎం నారాయణ అన్నారు. నేను జగన్ కాళ్లకు నమస్కారం పెడితే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారట.. ఎక్కువ అన్నం తింటే జీర్ణం కాదని.. పేదలకు సీఎం జగన్ చేసే మంచి పనులు చూసి వయస్సును కూడా పట్టించుకోకుండా పాదాలకు దండం పెట్టానని స్పష్టం చేశారు. నేను జగన్ కాళ్లకు మొక్కడాన్ని ఎవరైనా తప్పు పడితే.. వాళ్ల ఖర్మ అని మండిపడ్డారు. మంత్రి పదవి ఇవ్వకున్నా.. జగన్ కాళ్లకు మొక్కేవాడినని.. పేర్కొన్నారు.
స్కావెంజర్సుకు జీతాలు పెంచితే.. కొందరు కెబినెట్టులో అభ్యంతరం పెట్టారు.. కానీ జగన్ పట్టు పట్టి ఇచ్చారని.. స్కావెంజర్స్ చేసే పని ఎవ్వరైనా చేయగలరా..? మనమేవరం చేయలేం కదా..? అని జగన్ అన్నారని గుర్తు చేశారు.
వచ్చేది మా ప్రభుత్వమే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చేది లేదు.. చచ్చేది లేదు… నేనేం ఎగ్రెసివ్ గా మాట్లాడ్డం లేదు.. ఆవేదనతో మాట్లాడుతోన్నానని స్పష్టం చేశారు. పేదల కోసం సంక్షేమ పథకాలు ఇస్తుంటే.. మాజీ ఐఏఎస్సులు ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేష్ వంటి వారికి నచ్చడం లేదేమో..? మాజీ ఐఏఎస్ ఎస్సాఆర్ శంకరన్ పేదల కోసం ఏం చేశారో గమనించాలన్నారు. ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేష్ పేదలను అగర్భ శత్రువులుగా చూస్తున్నారనిఆగ్రహం వ్యక్తం చేశారు.