టీడీపీ, బీజేపీలతో పవన్‌ కల్యాణ్‌ అక్రమ సంబంధం – మంత్రి కొట్టు

-

టీడీపీ, బీజేపీలతో పవన్‌ కల్యాణ్‌ అక్రమ సంబంధం పెట్టుకున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ. శ్రీశైలంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ…. చట్టం ఎవరికి చుట్టం కాదు చంద్రబాబు తప్పు చేస్తే శిక్ష తప్పదని.. చంద్రబాబు తప్పులు ఒకటి కాదు ఇకమీదట ఒక్కొక్కటి వస్తూనే ఉంటుందని వెల్లడించారు.

చంద్రబాబు అరెస్టుపై ఎవ్వరు బాధపడకపోగ 2014 లో ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే దోచేసారని.. జనసేనకు ఒంటరిగా వెళ్లే సత్తా లేదు వాళ్లు అందరూ కలిపిన 20 మంది అభ్యర్థులు లేరన్నారు. జనసేనకు అభ్యర్థులు 18 మంది ఉన్నారు మిగిలిన స్థానాల్లో చంద్రబాబుని పెట్టమని పవన్ అంటున్నాడని.. చంద్రబాబు ప్రజలకు మొహం చూపించడానికి లేదని చురకలు అంటించారు.

సినీ గ్లామర్ సామాజిక వర్గం సపోర్ట్ చేస్తుందని పవన్ కు ప్యాకేజీతో కమర్షియల్ బంధం ఏర్పర్చుకున్నారని.. పవన్ ముందు బీజేపీతో తర్వాత టిడిపి తో కలిశారు ముందు వచ్చిన బంధం కంటే అక్రమ సంబంధంతో ముందుకు వెళ్తున్నాడని చురకలు అంటించారు మంత్రి కొట్టు సత్యనారాయణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version