నేను చిన్న పిల్లాడినా ట్రాప్‌లో పడటానికి..!

-

భార్యతో కాకుండా మాదురితో ఉండటంలో నైతికత ఏం లేదని, చట్టబద్దం కూడా కాదని తనకు తెలుసన్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. కానీ నాకున్న పరిస్దితులు మేం కలుసుకొక తప్పడం లేదు. నా‌వ్యక్తిగత వ్యవహారాలు , ఆహారం వంటివి మాదురినే చూసుకుంటున్నారు. గత రెండేళ్లలో నేను ఎలా ఉన్నాను అని అడిగేవారు లేని పరిస్దితులు. కానీ ఈరోజు వచ్చి మా నాన్న, దువ్వాడ శ్రీను నాభర్త అంటే ఆశ్చర్యంగా ఉంది.

నేను ఎన్ని భాదలు, ఎన్ని హింసలు పడ్డానో ఎవరికీ తెలియదు. ప్రేమ ఉంటే నాలుగు గోడల మద్య చర్చ జరుగుతుంది. బహిరంగంగా జరుగుతుంది అంటే టార్గెట్. నన్ను బద్నాం చెయాటానికి జరుగుతున్న వ్యవహారం ఇది. నన్ను ట్రాప్ చేయటానికి చిల్లి‌గవ్వ ఆస్తి లేదు. అయినా నేను చిన్న పిల్లాడినా ఎవరి ట్రాప్‌లో పడటానికి. మాదురిని పార్టిలో చెర్చింది దువ్వాడ వాణీనే. ఇప్పుడు అదే మహిళను‌ సాటి మహిళగా కూడా చూడకుండా అబాసుపాలు చెసారు అని శ్రీనివాస్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version