ఏపీలో 5 జిల్లాలకు వరద ముప్పు ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్‌లకు హెచ్చరికలు చేసింది వాతావరణ శాఖ. వాయుగుండం ప్రభావంతో ఏపీ, తమిళనాడుతో పాటు కర్ణాటకలోనూ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ముఖ్యంగా సత్య సాయి చిత్తూరు అన్నమయ్య తిరుపతి వైయస్సార్ నెల్లూరు ప్రకాశం అనంతపురం జిల్లాలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ఇవాళ తీరం దాటే సమయంలో 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వేస్తాయని కూడా హెచ్చరించింది. కాబట్టి మత్స్యకారులు వేటలకు వెళ్లకూడదని కూడా సూచించింది. అటు చెన్నైలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గత మూడు రోజులుగా విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి.