ఏపీ ప్రజలకు అలర్ట్.. APలో ప్రతి కుటుంబం కులాన్ని మరోసారి నిర్ధారించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. గోల్డెన్ డేటా పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించనున్నారు. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ లో 2021లో నెలపాటు కుటుంబాల వారి కులం/ ఉపకులం డేటాను వాలంటిర్లు నమోదు చేశారు.
ఇప్పుడు ఆ సమాచారాన్ని VROల చేత మరోసారి పరిశీలింపచేసి గోల్డెన్ డేటాను రూపొందించనున్నారు. దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. కాగా, ఏపీ నేతన్నలకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. ఈ నెల 21న చేనేత నేస్తం నిధులు విడుదల చేయనున్నారు. ఈ నెల 21న తిరుపతి జిల్లా.. వెంకటగిరిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చేనేత నేస్తం నిధులను నేత కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్. ఈ మేరకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.